పల్లవి : నిరంతరం నీతోనే జీవించాలనే
ఆశ నన్నిల బ్రతికించుచున్నది
నాప్రాణేశ్వరా యేసయ్యా
నా సర్వస్వమా యేసయ్యా
1.చీకటిలో నేనున్నప్పుడు - నీ వెలుగు నాపై ఉదయించెను
నీలోనే నేను వెలగాలని - నీ మహిమ నాలో నిలవాలని
పరిశుద్ధాత్మ అభిషేకముతో - నన్ను నింపుచున్నావు - నీరాకడకై
|| నిరంతరం ||
2.నీ రూపము నేను కోల్పోయినా - నీ రక్తముతో కడిగితివి
నీతోనే నేను నడవాలని - నీ వలెనే నేను మారాలని
పరిశుద్ధాత్మ వరములతో - అలంకరించుచున్నావు - నీరాకడకై
|| నిరంతరం ||
3.తొలకరి వర్షపు జల్లులలో - నీ పొలములోనే నాటితివి
నీలోనే చిగురించాలని - నీలోనే పుష్పించాలని
పరిశుద్ధాత్మ వర్షముతో -సిద్ద పరచుచున్నావు - నీరాకడకై
|| నిరంతరం ||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.