ఆత్మీయుడా
Lyric & Vocal : Dr.P Satish Kumar
Tune : Bro Sunil
Music : Bro Sandeep
ఆత్మీయుడా - నా ఆత్మ దేవుడా
ఆదరించుమా - మమ్ము ఆదరించుమా
నీ ప్రజలను - దర్శించుమయ్యా
నీ జనులను - దీవించుమయ్యా
ఆధారమా నా ఆశ్రయమా - మమ్మునాశీర్వదించుమా
|| ఆత్మీయుడా||
1. ఆదరణ లేక - ఆశ్రయం లేక
ఆధారం లేక - అల్లాడుతున్న
నీ ప్రజలను - దర్శించుమయ్యా
నీ జనులను - దీవించుమయ్యా
ఆధారమా నా ఆశ్రయమా - మమ్మునాశీర్వదించుమా
|| ఆత్మీయుడా||
2. ఆరోగ్యం లేక - ఆనందం లేక
ఆశలే లేక - ఆవిరైపోతున్న
నీ ప్రజలను - దర్శించుమయ్యా
నీ జనులను - దీవించుమయ్యా
ఆధారమా నా ఆశ్రయమా - మమ్మునాశీర్వదించుమా
|| ఆత్మీయుడా||
3. ఆప్యాయత కరువై - అనురాగం మరుగై
అందరికి దూరమై - అనాధగ ఉన్న
నీ ప్రజలను - దర్శించుమయ్యా
నీ జనులను - దీవించుమయ్యా
ఆధారమా నా ఆశ్రయమా - మమ్మునాశీర్వదించుమా
|| ఆత్మీయుడా||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.