కరుణించవా దేవా
Lyrics & Producer : Joshua Shaik ( Passion For Christ Ministries )
Music : Pranam Kamlakhar
Vocals : Chaitra Ambadipudi
కరుణించవా దేవా - కరుణాత్ముడా రావా
నీ ప్రేమలోనే - కావుమా
శ్రమలోన తోడే లేక - శిలనైన కానే కాక
వేసారిపోయా యేసయ్య
పిలిచాను నిన్నే దేవా - కడదాక నాతో రావా
నా జీవ దాత యేసయ్య
1. ఆశే నీవై నాలో - నా జీవ గమనములోన
దారే చూపే నాకు - నీ వాక్య వెలుగులలోన
నీలో నివాసమే - నాలోని కోరిక
నీ స్నేహ బంధమే - సంతోష కానుక
నీలో నిరీక్షణే - నా మౌన గీతిక
కాలాలు మారినా - నీవుంటే చాలిక ||కరుణించవా||
2. ప్రేమే నాపై చూపి - నా చేయి విడువని దేవా
ధైర్యం నాలో నింపి - నాతోటి నడచిన దేవా
నీ సత్య మార్గమే - నా జీవ బాటగా
నీ నామ ధ్యానమే - నాలోని శ్వాసగా
నీలోనే ఏకమై - నీ ప్రేమ సాక్షినై
సాగాలి యేసయ్య - నా జీవితాంతము ||కరుణించవా||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.