రాజాధిరాజ రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలకా ||2|| విడువని కృప నాలో స్థాపించేనే సీయోనులో నున్న స్తుతుల సింహాసనమును ||2||
|| రాజాధి రాజా ||
1. వర్ణనకందని పరిపూర్ణమైన నీ
మహిమ స్వరూపమును నాకొరకే త్యాగముచేసి||2||
కృపాసత్యములతో కాపాడుచున్నావు
దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేద ||2||
|| రాజాధి రాజా ||
2. ఊహలకందని ఉన్నతమైన నీ
ఉద్దేశ్యములను నా యెడల సఫల పరిచి ||2||
ఊరేగించుచున్నావు విజయోత్సవముతో
యేసయ్య నీకన్న తోడెవ్వరులేరు ఈ ధరనిలో||2||
|| రాజాధి రాజా ||
3. మకుటము ధరించిన మహారాజువై నీ
సౌభాగ్యమును నా కొరకై సిద్ధపరచితివి ||2||
నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి
నీ సాక్షినై కాంక్షతో పాడెద స్తోత్ర సంకీర్తనలే ||2||
|| రాజాధి రాజా ||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.