ఇది నవోదయం
ఆలాపన: మహా... శుభదినం దివితేజుడు - భువికేతించిన దినం
ఓఓ..ఓఓ..ఓఓ....ఓఓ..ఓఓ..ఓఓ
పల్లవి: ఇది నవోదయం దివితేజుడు - భువికేతించిన దినం
మహిమాన్వితుడు - మహికేతించిన మహా శుభదినం.....||2||
పాడెదమ్ పాడెదమ్ - రారాజు పుట్టాడని
చాటెదమ్ చాటెదమ్ - రక్షకుడు వెలిసాడని.....||2||
ఆహా హ్యాపి క్రిస్మస్ - ఓహో మెర్రి క్రిస్మస్
ఆహా హ్యాపి క్రిస్మస్ - ఓహో..హో మెర్రి క్రిస్మస్
1.చ: కన్య మరియ గర్భమందు - కారణజన్ముడై అవతరించే
పాపాన్ని రూపుమాప - నరరూపం ధరియించే.....||2||
మానవాళ్ళిని రక్షించే - పరవాసులన్ చేయవచ్చే.....(పాడెదమ్ )
2.చ: గగనాన్న పుట్టింది ఓ తార - చూపింది జ్ఞానులకు దారి
శిశువును గాంచి సంతసించి - సాగిలపడి పూజించిరి.....||2||
బంగారు సాంబ్రాణి బోళము - సమర్పించి తరియించిరి .....(పాడెదమ్)
3.చ: దూత తెల్పె దావీదు పురమందు - రక్షకుడు పుట్టాడని
పరలోక సైన్యం పరవశించి - పాడిస్తుతించె ప్రభువుని.....||2||
శాంతి సమాధానం రక్షణనివ్వ - వేంచేసెనని....( పాడెదమ్ )
Album: ఇది నవోదయం II Idi Navodhayam
Lyrics : Bro. Yohanu Katru
Produced by : Katru Sreshta
Tune & Music : KY Ratnam
Singer : Sireesha Bhagavatula
No comments:
Write CommentsSuggest your Song in the Comment.