నిను విడచి ఉండలేనయ్యా
యేసయ్యా...
నీవే నాకు మార్గము, సత్యము, జీవమయ్యా.....
నిను విడచి ఉండలేనయ్యా...
నీ ప్రేమను మరువలేనయ్యా... (2)
నను ప్రేమించెను...
నను విడిపించెను...
నను దీవించెను...
నను బ్రతికించెను...
అనుక్షణము...రక్షించెను
యేసు - నన్ను
అనుక్షణము... రక్షించెను
నా దేవుడు - గొప్ప దేవుడు..
నా యేసయ్యా- ప్రేమామయుడు (2)
(నిను విడచి)
1. నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా...
కారు చీకటే నన్ను కమ్మి వేసినా.. (2)
శత్రువులను చెదరగొట్టి - చీకటిని వెలుగు చేసి (2)
ప్రతి క్షణము - కాపాడెను
యేసు నన్ను
ప్రతి క్షణము కాపాడెను....
( నా దేవుడు)
2. నిందలతో నన్ను క్రుంగదీసినా...
మాటలతో నన్ను గాయపరచినా... (2)
నా చెయ్యిని పట్టుకొని - తన అక్కున చేర్చుకొని (2)
నా గాయము స్వస్థ పరచెను..
యేసు
నా గాయము స్వస్థ పరచెను..
( నా దేవుడు)
3. కన్న వారే నన్ను విడిచి వేసినా
కట్టుకున్న వారే నన్ను వదిలి వేసినా... (2)
నా చెయ్యిని విడవ కుండా - నన్ను వదిలేయ కుండా...(2)
అను నిత్యము నాతో ఉండెను.
యేసు
అను నిత్యము నాతో ఉండెను.
( నా దేవుడు)
No comments:
Write CommentsSuggest your Song in the Comment.