ప్రేమించే నా తండ్రి
నన్ను ప్రేమించే నా తండ్రి - ఇది పాట ఒక్కటే కాదండి
నేను చెప్పలేని హృదయం మాట ఇది ||2||
|| Chorus ||
నేను ఉదయమునే లేవుటకు ఊపిరి నిచ్చావు
రోజంతా నిన్ను వెతకుటకు శక్తిని ఇచ్చావు
నా పనులన్నిటిలో నీవు తోడైయున్నావు
నేను మరచినా నీవు నన్ను మరువనన్నావు
ఏమిచ్చి నీ ప్రేమను వర్ణింతును నా యేసు
నా శక్తిని అనుకున్నాను నిను నేను చూడలేదు యేసు
అయినా నన్ను ప్రేమించి - నా స్థితిని మార్చావు
నన్ను నీవు హత్తుకొని - నీ సొత్తుగా నన్ను చేసావు
1. ఎన్నో మారులు ఓడిపోతిని -
పైకి లేవలేక కృంగిపోతిని
నా శక్తితో పోరాడితిని - ఇంకా లోతునకు జారిపోతిని
నీ చేయి నన్ను విడిచి పెట్టదు
ఏ లోతైన నీవు రాక మానవు ||2||
|| నేను ఉదయమునే ||
2. నా చేతులకు పని నేర్పించి - నా
జీవితముకు దర్శనమిచ్చి
నా మార్గములో వెలుగై ఉండి -
కంటికి రెప్పలా కాపాడితివి
యేసయ్య నిన్ను ప్రేమించెద
మనసారా స్తుతించెద ||2||
|| నేను ఉదయమునే ||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.