మండించు ప్రభువా
పల్లవి: మండించు ప్రభువా నీ ఆత్మ నాలో -
ప్రకాశించెద నీ ప్రతిబింబమై
రగిలించు ప్రభువా ఉజ్జీవము -
వెలిగించెద అనేకులను ॥2॥
అభిషేకించయా నన్ను మండించయా-
నాపై ప్రోక్షించయా నీ ఆత్మను ॥2॥
1. అంత్యకాలపు అభిషేకం కుమ్మరించుము మాపైన
మండుచున్న పొదలాగ ఆరకుండ మండించయ్యా ॥2॥
పెంతెకోస్తు దినమున దిగిన
ఆత్మవర్షము కురిపించయ్యా
మేడగదిలో పొందిన అనుభవం
నేడు మాకు ఇమ్మయ్యా ||అభిషేకించయా||
2. అంధకార శక్తులను నీదు ఆత్మతో బంధించయ్యా
దాగివున్న సర్పములన్ కాల్చివేయుము నీ అగ్నిలో ॥2॥
ఎండిపోయిన ఎముకలను జీవింపచేయుము నీ ఆత్మతో
శరీర క్రియలను నసింపజేసే దహించు
ఆత్మతో నింపయ ||అభిషేకించయా||
3. ఆత్మ కలిగిన పరిచర్య చేయు జ్ఞానము మాకిమ్మయా
మహిమ కలిగిన కార్యములు సంఘమందు జరిగించయా ॥2॥
మాలో ఉన్న కృపావరములు ప్రజ్వలింప చేయుమయా
నిత్యము మండే బలిపీఠముగా
అగ్ని మాలో రగిలించయా ||అభిషేకించయా||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.