స్తుతి కీర్తనీయుడా
స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ
నా హృదయ వీణపై శృతిచేసి పాడనా
నా యేసు రాజా అనురాగ బంధమా
నన్ను విడవలేని ఆత్మ అనుబంధమా "2"
1.నా ప్రియ నేస్తమా నా ప్రాణబంధమా
నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఆదరించుమా "2"
నీ సిలువ త్యాగం నేనెలా మరిచిపోదును
ఇలలోన నీకై సాక్షిగా జీవించును "2"
" నా యేసు రాజా "
2. నా నీతి సూర్యుడా తేజో ప్రకాశమా
నీ వెలుగు జాడలలో నిను వెంబడించిగా "2"
నీ జీవ వాక్యం నింపినే నాలో ధైర్యము
ప్రాణాత్మ దేహం సర్వదా నీకే అంకితం "2"
" నా యేసు రాజా "
3. మహిమ సింహాసనం నే చేరాలనే
నే కన్న కలలన్నీ నిజమైన వేళలో "2"
నా జయము నీవై నిలిచినా శ్రేష్ట తరుణాన
నీలోనే లీనమై పోదునే నే నిరంతరము "2"
" నా యేసు రాజా "


No comments:
Write CommentsSuggest your Song in the Comment.