అధికమైనది నీ కృప
అధికమైనది నీ కృప అంతులేనిది
అంధకార గుడారములో ఆదరించినది ఏసయ్యా
అంతులేని ఆగాధరములో ఆదుకున్నది
" అధికమైనది"
1. ఎవ్వరు లేని ఎడారిలో సమ్మతి లేని సుడిగాలిలో (2
బెదరిపోయిన చెదరనీయక (2)
నీ కౌగిలిలో నను దాచావయా
నా కన్నీరే తుడిచావయా (2)
ఏమియ్యను నేనేమియ్యగలను
ఏమిచ్చి నీ రుణమునే తీర్చగలను
ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా
నీ కానుకనై నిను పూజించనా
నా ఏలిక నీవని సేవించన (2)
" అధికమైనది"
2. ఐగుప్తులోని జనాంగము అంగలార్పునే విన్నావే (2)
అద్భుతముగ నీవే విడిపించినావే (2)
నీ దాసునితో నీవు మాట్లాడినావా
సంద్రము పాయలుగా చేసినావే
ఏమియ్యను నేనేమియ్యగలను
ఏమిచ్చి నీ రుణమునే తీర్చగలను
ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా
నీ కానుకనై నిను పూజించనా
నా ఏలిక నీవని సేవించనా (2)
" అధికమైనది"
No comments:
Write CommentsSuggest your Song in the Comment.