చూపు లేని వారికి
చూపును ఇచ్చే దేవుడవు
మాట రాని మనిషికి
మాటలను ఇచ్చే దేవుడవు
ప్రాణము లేని వారికి
జీవము పోసే దేవుడవు
అపవిత్ర ఆత్మలను బంధించే దేవుడవు
ఎన్నో గొప్ప కార్యములు
చేసేవాడవు యేసయ్యా
స్వస్థత నాకు కలుగును
నా నమ్మకం నీయందే ఉన్నెను
నీ రక్తము నన్ను శుద్ధి పరచును
నీవు పొందిన దెబ్బల చేత
నాకు స్వస్థత కలుగును
వెంటరిగ ఉన్న వారికి
తోడుగా నిలిచే దేవుడవు
వ్యసనములో ఉన్న వారికి
విడుదల ఇచ్చే దేవుడవు
మనశ్శాంతి లేని వారికి
నెమ్మది ఇచ్చే దేవుడవు
కృంగి ఉన్న వారికి
ధైర్యము ఇచ్చే దేవుడవు
ఎన్నో గొప్ప కార్యములు
చేసేవాడవు యేసయ్యా
స్వస్థత నాకు కలుగును
నా నమ్మకం నీయందే ఉన్నెను
నీ రక్తము నన్ను శుద్ధి పరచును
నీవు పొందిన దెబ్బల చేత
నాకు స్వస్థత కలుగును
యేసయ్యా యేసయ్యా
నీకే మొర పెట్టుకున్నాను యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
నీ సాక్షిగా నన్ను నిలుపు యేసయ్యా
No comments:
Write CommentsSuggest your Song in the Comment.