ఉత్సాహ గానము చేసెదము
ఉత్సాహ గానము చేసెదము
ఘనపరచెదము మన యేసయ్య నామమును (2)
హల్లెలూయ యెహోవ రాఫా
హల్లెలూయ యెహోవ షమ్మా
హల్లెలూయ యెహోవ ఈరే
హల్లెలూయ యెహోవ షాలోమ్ (2)
1. అమూల్యములైన వాగ్ధానములు
అత్యధికముగా ఉన్నవి (2)
వాటిని మనము నమ్మినయెడల
దేవుని మహిమను ఆనుభవించెదము (2)
"హల్లెలూయా "
2. ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి
ఇవన్నీ వాగ్ధాన ఫలములే గా
ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది
ఆత్మీయ వరములు అనుభవించెదము
"హల్లెలూయా "
3. వాగ్ధాన దేశము పితరులకిచ్చిన
నమ్మదగిన దేవుడాయన (2)
జయించిన వారమై అర్హత పొంది
నూతన యెరుషలేం ఆనుభవించెదము
"హల్లెలూయా "
No comments:
Write CommentsSuggest your Song in the Comment.