స్వస్థపరచు దేవుడు
స్వస్థపరచు దేవుడు – సర్వ శక్తిమంతుడు
కష్ట కాలములోన నన్ను – మరచిపోడు
నమ్మదగిన దేవుడు – ఎన్నడూ ఎడబాయడు
మాట ఇచ్చిన దేవుడు – నెరవేరుస్తాడు
నన్నే ఎన్నుకున్నాడు – నా పేరు పెట్టి పిలిచాడు
శ్రమ ఎదురైనా – బాధేదైనా విడువని దేవుడు
నా పక్షముగానే ఉన్నాడు – నా చేయి పట్టి నడిపాడు
కృంగిన వేళ ధైర్యమునిచ్చి కృప చూపించాడు
||స్వస్థపరచు||
1. చీకటి నుండి వెలుగునకు నడిపించిన నా రక్షకుడు
మరణము నుండి జీవముకు నను దాటించాడు
మారా వంటి జీవితము మధురముగా మార్చాడు
రోగము నిండిన దేహమును బాగు చేసాడు
పొందిన దెబ్బల ద్వారానే స్వస్థతనిచ్చు దేవుడు
చిందించిన రక్తము ద్వారా విడుదలనిచ్చియున్నాడు
అతడే నా ప్రియ యేసుడు – యేసే నా ప్రియ స్నేహితుడు
కౌగిలిలో నను హత్తుకొని కన్నీటిని తుడిచాడు
||స్వస్థపరచు||
2. దూతను ముందుగ పంపించి – మార్గము చక్కగ చేసాడు
ఆటంకములు తొలగించి – విజయమునిచ్చాడు
అగ్ని వంటి శ్రమలోన – నా తోడుగ ఉన్నాడు
ధగ ధగ మెరిసే పసిడి వలె శుద్ధీకరించాడు
నా యెడల ఉన్న ఉద్దేశములు హానికరమైనవి కావు
సమాధానకరమైనవిగా రూపొందించాడు
అతడే నా ప్రియ యేసుడు – యేసే నా పరిహారకుడు
వేదనలో నన్నెత్తుకొని నెమ్మదినిచ్చాడు
||స్వస్థపరచు||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.