లెమ్ము తేజరిల్లుము
లెమ్ము తేజరిల్లుము
నీకు వెలుగు వచ్చియున్నది
యెహోవా మహిమ నీమీద ఉదయించియున్నది
అ.ప.: వింతైన కార్యములు జరిగించును
నిను మరలా కట్టును
1. నీ దగ్గరకు జనులయొక్క
భాగ్యము తేబడును
శాశ్వత శోభాతిశయముగను
నిన్ను శృంగారించును
2. నీ దేశములో నాశనము
కనబడకుండును
దుఃఖదినాలు సమాప్తము
నీ గుండె ఉప్పొంగును
3. నీ శత్రువుల సంతతి
పాదముల వ్రాలును
రక్షకుడే జాలి చూపించును
నీకు భూషణమగును
No comments:
Write CommentsSuggest your Song in the Comment.