పిలచిన వాడవు
llపll పిలచిన వాడవు నా ప్రియ హితుడవు
నా ప్రియుడా నా యేసయ్యాll2ll
ఓటమిలో నను నడిపించే ధైర్యము నీవే
ఓరిమితో నను గెలిపించే సాయుథ నీవే
ఎంచుటకు యోగ్యత లేని నను పిలిచావే
నాలోన నీవే వుండి నడిపించావే
llఅను పll నాలోనా నే లేనే నీలాగే మారాలి
నిను విడచి మన లేనే చిరకాలం నీతోనేll2ll
llకోరస్ll ఒంటరి వారిని వేయి మందిగా చేసే వాడు
ఎన్నడు విడువడు నా జతగాడు యేసు నాథుడు
చెదరిన గుండెను బాగు చేసే పరమ వైద్యుడు
ఎందు వెదకినా కాన రాలేని నాటి దేవుడు
llపిలచిన వాడవు నా ప్రియ హితుడవుll
1. ఈ జీవము నీదేనని
తెలుసు కున్నానుగా
ధర మరువ లేని ఆ త్యాగము
నీవు చేసావుగా
నే తీర్చ లేను నీ ఋణమును
చాలించక నీలో ఈ తనువును
ఈ జీవితం నీదేగా వెనుదిరుగను నిను విడువక
llనాలోనా నే లేనే నీలాగే మారాలిll
2. వెతికాయి నా కనులు నిజమైన ప్రేమకై
స్వార్థమే లోకమంతా
నిజమైన ఆ ప్రేమ కదిలించే నీ వాక్కై
ఆత్మలో నీదు చెంతా
ఆ ప్రేమను నే మరతునా
నీ ఋణం తీరదు ఏమిచ్చినా
ఈ జీవితం నీదేగా వెనుదిరుగను నిను విడువక
llనాలోనా నే లేనే నీలాగే మారాలిl|
No comments:
Write CommentsSuggest your Song in the Comment.