నన్ను నీవు మరువక
మార్గము తెలిసిన తప్పిపోయాను
ఏటో తెలియక నిలిచిపోయాను
వంద మంది కొరకు నీవు పోలేదు
తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు
నన్ను నీవు మరువక
నన్ను నీవు విడువక
జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు
తృణీకరించక నన్ను త్రోసివేయక
సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు
1. శ్రేష్టమైన జనులు ఉన్ననూ
విలువలేని నా కోసం వచ్చావు||2||
నన్ను వెదుకుట నీవు ఆపక
నన్ను ప్రేమించుట నీవు మరువక||2||
నూతన ప్రారంభం ఇచ్చావు
నీ బుజములపై నన్ను మోసావు
2. రాళ్లు విసిరె మనుషులు మధ్యలో
నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు||2||
నా చెయ్యి పట్టీ నన్ను లేపావు
నా మరకలను తుడిచావు ||2||
నీ బిడ్దగా నన్ను మార్చివేసావు
నన్ను త్రోసివేయని తండ్రీవి నీవే
No comments:
Write CommentsSuggest your Song in the Comment.