నీ కన్నుల్లోనీ కన్నీరు
నీ కన్నుల్లోనీ కన్నీరు కవిలలో దాచాను
నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నానుII2II
నిన్ను ఎన్నడు నేను విడువబోనని
నిన్ను ఎన్నడు నేను మరువలేనని
నా కృప ఎన్నడును దూరం చేయనని
నీతో నేను నిబంధనను చేసి ఉన్నానుII2II
ఆరారారేరో.. ఆరారే..ఆరారారేరో..II2II
1. నీ శత్రువు ఎదుట నీకు భోజనం సిద్ధంచేసి
మీ పగవారి ఎదుట నిన్ను తైలముతో అభిషేకించి II2II
నీ గిన్నె నిండి పొర్లిపారును..
కృపయు క్షేమము నీ వెంట వచ్చును..II2II
నా కృప ఎన్నడును దూరం చేయనని
నీతో నేను నిబంధనను చేసి ఉన్నాను II2II
ఆరారారేరో.. ఆరారే..ఆరారారేరో..II2II
2. నీ దుఃఖ దినము సమాప్తి చేసి నిత్యానందముతో నింపి
నీ అవమానము కొట్టివేసి మంచి పేరును నీకిచ్చి
నీవెళ్ళు చోటులో తోడుగా ఉండెదను..
నిన్ను నేను గొప్ప చేసెదనుII2II
నా కృప ఎన్నడును దూరం చేయనని
నీతో నేను నిబంధనను చేసి ఉన్నానుII2II
ఆరారారేరో.. ఆరారే..ఆరారారేరో..II2II
3. నీ కన్నుల్లో నీ కన్నీరు కవిలలో దాచాను
నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నానుII2II
నిన్ను ఎన్నడు నేను విడువబోవనని
నిన్ను ఎన్నడు నేను మరువలేనని
ఆరారారేరో.. ఆరారే..ఆరారారేరో..II2II


No comments:
Write CommentsSuggest your Song in the Comment.