అర్హుడా
Verse 1
ఆరాధనకు అర్హుడా
నీకే నా ఆరాధన
స్తుతులపై ఆసీనుడా
నీకే నా స్తుతి కీర్తన
Pre-Chorus 1
మహిమ ఘనత ప్రభావములకు యోగ్యుడా
Chorus
ఆరాధన ఆరాధన నీకే
హల్లెలూయా హల్లెలూయా నీకే
Verse 2
విరిగిన మనసును నీ బలిపీఠముపై
పరిమిళముగా అర్పింతును
సిలువనెత్తుకొని నన్ను నే ఉపేక్షించి
వెనుతిరుగక వెంబడింతును
Pre-Chorus 2
నా శరీరమును సజీవ యాగముగా అర్పింతును
Chorus
ఆరాధన ఆరాధన నీకే
హల్లెలూయా హల్లెలూయా నీకే
Verse 3
అలలెన్నో నా పైకి ఎగిసినను
శత్రువులే నన్ను చుట్టినను
బలమంతా నాలో క్షీణించినను
విశ్వాసమే నాలో కొదువైనను
Pre-Chorus 3
ఆరాధనే నా ఆయుధమై జయింతును
Chorus
ఆరాధన ఆరాధన నీకే
హల్లెలూయా హల్లెలూయా నీకే
Bridge 1
సిలువకై పునరుత్థానికై
నా విమోచనకై ఆరాధన
నీ మేలులకై విశ్వాస్యతకై
శాశ్వత ప్రేమకై ఆరాధన
Bridge 2
పరిశుద్ధుడా గొఱ్ఱెపిల్ల
యూదా సింహమా నీకే ఆరాధన
Chorus
ఆరాధన ఆరాధన నీకే
హల్లెలూయా హల్లెలూయా నీకే
No comments:
Write CommentsSuggest your Song in the Comment.