కారుణాసాగర
కనుపాపగ నను కాచితివి
ఉన్నతమైన ప్రేమతో
మనసున మహిమగా నిలిచితివి ||2||
||కారుణాసాగర యేసయ్యా||
1. మరణపులోయలో - దిగులు చెందగా
అభయము నొందితి - నిను చూచి ||2||
దాహముతీర్చిన జీవనది
జీవమార్గము - చూపితివి ||2||
||కారుణాసాగర యేసయ్యా||
2. యోగ్యత లేని - పాత్రను నేను
శాశ్వత ప్రేమతో - నింపితివి ||2||
ఒదిగితిని - నీ కౌగిలిలో
ఓదార్చితివి - వాక్యముతో ||2||
||కారుణాసాగర యేసయ్యా||
3. అక్షయస్వాస్థ్యము - నే పొందుటకు
సర్వసత్యములో - నడీపీతివి ||2||
సంపూర్ణపరచి -జ్యేష్టులతో
ప్రేమనగరిలో - చేర్చుమయ్యా || 2||
||కారుణాసాగర యేసయ్యా||
👇👇👇
SUBSCRIBE MY CHANNEL
No comments:
Write CommentsSuggest your Song in the Comment.