నూతనమైన కృప
శాశ్వతమైన కృప బహు ఉన్నతమైన కృప
నిరంతరం నాపై చూపిన -
నిత్య తెజూడా యేసయ్య
నీ వాత్సల్యమే నాపై చూపించిన -
నీ ప్రేమను వివరించనా
నను నీ కోసమే ఇలా బ్రతికించిన -
జీవాధిపతి నీవయ్య
ఇదే కదా నీలో పరవశం -
మరువలేని తియ్యని జ్ఞాపకం
||నూతనమైన||
1. నా క్రయధనముకై - రుధిరము కార్చితివి
ఫలవంతములైన - తోటగా మార్చితివి ||2||
ఫలితముకొరకైన - శోధన కలిగినను
ప్రతిఫలముగ నాకు - ఘనతను నియమించి
ఆశ్చర్యకరమైన అదరణ - కలిగించి
అన్నివేలలయందు - ఆశ్రయమైనావు
ఎంతగా కీర్తించినా - నీ ఋణమే నే తీర్చగలనా
ఇదే కదా నీలో పరవశం -
మరువలేని తియ్యని జ్ఞాపకం
||నూతనమైన||
2. నీ వశమైయున్న - ప్రాణాత్మదేహమును
పరిశుద్ధపరచుటయే - నీకిష్టమాయెను |2||
పలు వేదనలలో - నీతో నడిపించి
తలవంచని తెగువ - నీలో కలిగించి
మదిలో నిలిచావు - మమతను పంచావు
నా జీవితమంతా - నిను కొనియాడెదను
ఎంతగా కీర్తించిన - నీ ఋణమే నే తీర్చగలనా
ఇదే కదా నీలో పరవశం -
మరువలేని తియ్యని జ్ఞాపకం
||నూతనమైన||
3. సాక్షి సమూహము -మేఘమువలెనుండి
నాలో కోరిన - ఆశలు నెరవేరగా ||2||
వేలాది దూతల - ఆనందము చూచి
కృప మహిమైశ్వర్యం - నే పొందిన వేళ
మహిమలో - నీతోనే నిలిచిన వేళ
మాధుర్య లోకాన - నిను చూచిన వేల
ఎంతగా కీర్తించిన - నీ ఋణమే నే తీర్చగలనా
ఇదే కదా నీలో పరవశం -
మరువలేని తియ్యని జ్ఞాపకం
||నూతనమైన||
👇👇👇
SUBSCRIBE MY CHANNEL
No comments:
Write CommentsSuggest your Song in the Comment.