సిలువలో వ్రేలాడే
సిలువలో వ్రేలాడే నీ కొరకే - యేసు నిన్ను
పిలచుచుండే - ఆలస్యము నీవు చేయకుము
1. కల్వరి శ్రమలన్ని నీ కొరకే - ఘోర సిలువ మోసే కృంగుచునే
గాయములాచే బాధనొంది - రక్తము కార్చి హింసనొంది
॥సిలువ॥
2. నాలుక యెండెను దప్పిగొని - కేకలు వేసెను దాహమని
చేదు రసమును పానము చేసి - చేసెను జీవయాగమును
॥సిలువ॥
3. అగాధ సముద్ర జలములైనా - ఈ ప్రేమను ఆర్పజాలవుగా
ఈ ప్రేమ నీకై విలపించుచూ - ప్రాణము ధార బోయుచునే
॥సిలువ॥
👇👇👇
SUBSCRIBE MY CHANNEL !!!
No comments:
Write CommentsSuggest your Song in the Comment.