ఏ రాగమో తెలియదే.....
అశతో వున్నా... తృష్ణకలిగున్నా.. 
ఆరాధించాలని..
ఆత్మతో సత్యముతో... 
నా పూర్ణహృదయముతో
నిన్ను ఘనపరచాలాని...
ఏ రాగమో తెలియదు.. 
ఏ తాళమో తెలియదు.. 
ఏమని పాడను  నిన్ను-ఎంతని పోగడను 
యేసయ్యా.....యేసయ్యా...
1. ఓటములలో- ఓదార్పువై 
ఓర్పు నేర్పించావయ్యా
వేదనలలో- విశ్రాంతివై 
వెన్నంటి నిలచావయ్యా 
జీవితం నీదయ్యా నాకన్నదేముందయ్యా
 నాకున్నదంతనీవే కదా..
యేసయ్యా.....యేసయ్యా...
2. నీచేతితో చేశావులే  నీరూపమిచ్చావులే 
నాచెంతకే చెరావులే 
నా సొంతమైయ్యావులే
మాటలే లేవయ్యా అర్థమే కాదయ్యా
ఈ శిలకోసం బలియాగమా.. 
యేసయ్యా.....యేసయ్యా...


No comments:
Write CommentsSuggest your Song in the Comment.