వన్నెస్ - 2
1. దావీదు వలె నాట్యమాడి -
తండ్రీని స్తుతించెదము (2)
యేసయ్యా స్తోత్రముల్ (4)
తంబురతోను సితారతోను -
తండ్రిని స్తుతించెదను (2)
యేసయ్యా స్తోత్రముల్ (4)
2. దేవునియందు నిరీక్షణ నుంచి ఆయనను
స్తుతించు నా ప్రాణమా (2)
నీకు సహాయము చేయువాడు
సదా ఆదుకొను ఆయనే (2)
ఆధారము - ఆదరణ - ఆయనలో (2)
3. నడిపించు నా నావా - నడి సంద్రమున దేవా
నవ జీవన మార్గమున - నా జన్మ తరియింప
నడిపించు నా నావా
నా జీవిత తీరమున - నా అపజయ భారమున
నలిగిన నా హృదయమును -
నడిపించుము లోతునకు
నా యాత్మ విరబూయ - నా దీక్ష ఫలియింప
నా నావలో కాలిడుము - నా సేవ చేకొనుము
నడిపించు నా నావా
4. యేసే నా పరిహారి - ప్రియ యేసే నా పరిహారి
నా జీవిత కాలమెల్ల - ప్రియ ప్రభువే నా పరిహారి (2)
ఎన్ని కష్టాలు కలిగిననూ -
నన్ను కృంగించె భాదలెన్నో (2)
ఎన్ని నష్టాలు వాటిల్లినా -
ప్రియ ప్రభువే నా పరిహారి (2)
5. అన్ని నామముల కన్న పై నామము -
యేసుని నామము
ఎన్ని తరములకైనా ఘనపరచదగినది -
క్రీస్తేసు నామము
యేసు నామము జయం జయము
సాతాను శక్తుల్ లయం లయము (2)
హల్లెలూయ హొసన్న హల్లెలూయా -
హల్లెలూయా ఆమెన్ (2)
సాతాను పై అధికార మిచ్చును -
శక్తి గల యేసు నామము (2)
శత్రు సమూహము పై జయమునిచ్చును -
జయశీలుడైన యేసు నామము (2)
6. పరమ జీవము నాకు నివ్వ - తిరిగి లేచెను
నాతో నుండ (2)
నిరంతరము నన్ను నడిపించును - మరల వచ్చి
యేసు కొని పోవును (2)
యేసు చాలును యేసు చాలును -
యే సమయమైన యే స్థితికైన -
నా జీవితములో యేసు చాలును
సాతాను శోధనలధికమైన -
సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను (2)
లోకము శరీరము లాగినను -
లోబడక నేను వెళ్ళెదను (2)
7. నా దాగు చోటు నీవే - నా ఆశ్రయ దుర్గమా (2)
నా కేడెము కోట నీవే (2)
నా రక్షణ శృంగమా
నా దాగు చోటు నీవే నా ఆశ్రయ దుర్గమా
8. రండి ఉత్సాహించి పాడుదము -
రక్షణ దుర్గము మన ప్రభువే
మన ప్రభువే మహా దేవుండు -
మన మహాత్యము గల రాజు
భూమ్యాగాధపు లోయలును
- భూధర శిఖరములాయనవే
రండి ఉత్సాహించి పాడుదము -
రక్షణ దుర్గము మన ప్రభువే
9. రాజాధి రాజు దేవాది దేవుడు -
త్వరలో వచ్చుచుండెను (2)
మన యేసు రాజు వచ్చును -
పరిశుద్ధులన్ చేయు మనలన్ (2)
ఆహా మన మచట కేగుదము (2)
10. నూతన గీతము పాడెదను -
నా ప్రియుడేసునిలో (2)
హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ ఆమెన్ (2)
యేసే నా మంచి కాపరి - యేసే నా గొప్ప కాపరి
యేసే నా ప్రధాన కాపరి - యేసే నా ఆత్మ కాపరి
యేసే నన్ను కొన్న కాపరి - యేసే నాలో
ఉన్న కాపరి (2)
11. యెహోవా నా కాపరి నాకు లేమిలేదు -
పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్ (2)
నూనెతో నా తలను - అభిషేకము చేయున్
నా హృదయము నిండి - పొర్లుచున్నది (2)
12. నాకెన్నో మేలులు చేసితివే
నీకేమి చెల్లింతును – దేవా నీకేమి అర్పింతును (2)
హల్లెలూయా యేసునాథా -
కృతజ్ఞతా స్తుతులు నీకే (2)
నాకిక ఆశలు లేవనుకొనగా
నా ఆశ నీవైతివే - ఆశలు తీర్చితివే
నలుదిశల నన్ను భయమావరింప
నా పక్షమందుంటివే – నాకభయమిచ్చితివే
హల్లెలూయా యేసునాథా -
కృతజ్ఞతా స్తుతులు నీకే (2)
13. మహోన్నతుడా - నీ కృపలో నేను నివసించుట
నా జీవిత ధన్యతై యున్నది (2)
మహోన్నతుడా - నీ కృపలో నేను నివసించుట (2)
నా జీవిత ధన్యతై యున్నది (2)
14. నే సాగెద యేసునితో - నా జీవిత
కాలమంతా (2)
యేసుతో గడిపెద యేసుతో నడిచెద (2)
పరమును చేరగ నే వెళ్లెద (2)
హనోకు వలె సాగెదా
15. నేడో రేపో నా ప్రియుడేసు - మేఘాలమీద
ఏతెంచును (2)
మహిమాన్వితుడై ప్రభు యేసు - మహీ స్థలమునకు
ఏతెంచును (2)
నేడో రేపో నా ప్రియుడేసు - మేఘాలమీద
ఏతెంచును
16. యేసు ప్రభువును బట్టి మా స్తోత్రములు
అందుకుందువని స్తుతి చేయుచున్నాము
దేవా నీవే స్తోత్ర పాత్రుడవు - నీవు మాత్రమే
మహిమ రూపివి
దేవా నీవే స్తోత్ర పాత్రుడవు
17. రమ్మనుచున్నాడు - నిన్ను ప్రభు యేసు
వాంఛతో తన కరము చాపి -
రమ్మనుచున్నాడు (2)
18. ప్రేమా ... ప్రేమా... · ప్రేమా ... ప్రేమా... (2)
19. ఎంత మధురము యేసుని ప్రేమ - ఎంత
మధురము నా యేసుని ప్రేమ (2)
20. మహిమ నీకే ప్రభూ - ఘనత నీకే ప్రభూ (2)
స్తుతి మహిమ ఘనతయు - ప్రభావము
నీకే ప్రభూ (2)
ఆరాధనా... ఆరాధనా... (2)
నా యేసు ప్రభునకే - ప్రియ యేసు ప్రభునకే
21. ఆరాధనకు యోగ్యుడా -
నిత్యము స్తుతియించెదను
నీ మేలులను మరువకనే - ఎల్లప్పుడు స్తుతి పాడెదను
ఆరాధనా... ఆరాధనా... (2)
నీ మేలులకై ఆరాధన
- నీ దీవెనకై ఆరాధన (2)
ఆరాధనా... ఆరాధనా... (2)
No comments:
Write CommentsSuggest your Song in the Comment.