చిరునవ్వునే ఇచ్చిన
ప: కన్నీరంతా కాలం చేసిన
కష్టాలన్నీ కలగా మార్చిన
చిరునవ్వునే ఇచ్చిన
నా చింతలే తీసిన నీకే
ఆరాధన స్తుతి ఆరాధన
యేసయ్య నీకే నా ఆరాధన
1. కుమిలి కుమిలి ఏడ్వగ నేను
కుమారుడా భయపడకూ అని
కృంగి పోతూ ఉండగా నేను
కన్నా నీకున్నా నేనని
కన్నీటి సంద్రంలో
కలవరాల కాలములో
కరుణతో కమ్మి
కలతలే తరిమి,
కన్న ప్రేమ చూపి
చిరునవ్వునే ఇచ్చిన
చింతలే తీసిన నీకే
|| ఆరాధన స్తుతి ఆరాధన ||
2. ఎగరేసే సుడిగాలైన
ఎన్నడు ఇక కదల్చకుండా
చెలరేగే తుఫాను అయినా
ఎన్నడు నను ముంచకుండా
శోధింపబడిన నన్ను
శుద్ధ సువర్ణము చేసి
నిశ్చలమైన స్థలమునకు
నను తీసుకుని వచ్చి
చిరు నవ్వునే ఇచ్చిన
నా చింతలే తీసిన నీకే
|| ఆరాధన స్తుతి ఆరాధన ||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.