కృతజ్ఞతలు యేసు వందనములు
కంటిరెప్పలా మమ్మును కాచినందుకు
సిలువనీడలో నిత్యం కాచినందుకు
"పరిశుద్ధుడా యేసయ్యా - కృపచూపే ప్రేమమయా"
నీవంటి దైవం - లేనేలేరయ్యా
Charanam 1:
కష్టమైనా నష్టమైనా - బాధలు ఎన్నైనా
తల్లిగా మా తండ్రిగా - మా తోడై నిలిచావే
నీ మేలులు మేము - మరువలేమయ్యా
ఏమిచ్చి నీ ఋణము - తీర్చగలమయ్యా
Charanam 2:
ప్రాణమే పెట్టేంతగా - నీ కోసమే జీవిస్తాం
మా బ్రతుకునే వెలిగించినా - నీ నామము ప్రకటిస్తాం
ఆకుల ప్రిస్కిల్ల వలె మేము
నీ ప్రజల రక్షణకై పనిచేస్తాము
Charanam 3:
ప్రార్ధనే మా ఆయుధం - విశ్వాసమే మా విజయం
మము నడిపెను బలపరచెను - ప్రతినిత్యం నీ వాక్యం
నేను నా ఇంటివారందరు
నిన్నే సేవింతుము సర్వకాలము


No comments:
Write CommentsSuggest your Song in the Comment.