నీవే నా శైలము
నీవే నా శైలము నా నమ్మకము నీలో
నీవే నాకు చోటని నివసించెదను నీలో 2
శ్రమల సమయములలో
సుఖమైన వేళలో
ఓటమి మధ్యలో
ఉన్నతా కీర్తిలో 2
ఏ స్థితిలోనైనను మారాని దైవమా
నిన్నే నే నమ్మెదన్ నిన్నే విశ్వసించెదన్
పడిపోను నేనెన్నడు
నీవే.....నాకు..... . నీలో 2
1. నరులను నే నమ్మితిన్
ప్రభువులను నమ్మితిన్
ధనమును నే నమ్మితిన్
నా బలమును నే నమ్మితిన్ 2
నే నిన్ను మరచిన నను మరవని దైవమా
నిన్నే నే నమ్మెదన్ నిన్నే విశ్వసించెదన్
పడిపోను నేనెన్నడు
నీవే.......నాకు...... నీలో 2
2. నాదు జీవపు వెలుగు నీవే మార్గము నీవే
జారిపోకుండ కాచువాడా
నా తల్లి తండ్రి నీవే నా స్నేహము నీవే
నా సర్వం అయినవాడ 2
నీవే....నాకు...... నీలో 2
పడిపోను నేన్నాడు


No comments:
Write CommentsSuggest your Song in the Comment.