Devaa Nee Thalampulu || దేవా నీ తలంపులు||DEVA NE THALAMPULU|| ||New Telugu Christian Video Song|| K.Anil kumar, Moses Dany
దేవా నీ తలంపులు
నాకెంతో అమూల్యమైనది
నీ సన్నిధి నాకు
తోడుగా నిలిచినది(2)
జీవమిచ్చిన ప్రేమ నీది
పొందుకున్న ధన్యత నాది
నీ పనికి నేను
సహకారిగా నిలిచెదను (2)
అంధకారంలో ఉన్న
నన్ను వెలిగించావు
నా వేదనలలో
ఆదరించి బలపరిచావు
నిశ్శబ్దములో ఆశలై
మురిపించావు
నీ ప్రేమతో నన్ను
ఆదరించావు (దేవా నీ)
ఈ లోక అవమానాలు
ఎత్తి నన్ను చూపిన
శుద్ధమైన స్నేహముతో
చేయిపట్టి నడిపితివే (2)
ప్రతిజ్ఞలో నాకు
వెలుగును చూపించి
నీ ఒడిలో నాకు
శాశ్వత జీవమిచ్చితివే (అంధ)
నీ సంకల్పంలో నన్ను
ఎన్నుకున్న రీతిగా
నా జీవితమంతా
నీకు అప్పగించే వానిగా(2)
నీ ప్రేమకు ప్రతిగా
మాదిరి చూపించి
బ్రతుకు దినములన్నియు
నీకు సాక్షిగా నిలిచెదను(అంధ)
Follow, Like and Share
Telegram Channel: Click Here
Facebook Page: Click Here
For More Songs Click Here


No comments:
Write CommentsSuggest your Song in the Comment.