Viduvani Kshanam (విడువని క్షణం) | విడువకు నన్ను యేసయ్య | నిను విడచి క్షణం ఉండలేనయ్య || Official Telugu Christian Worship Song | JP Ramesh Music
పల్లవి:
విడువకు నన్ను యేసయ్య
నిను విడచి క్షణంఉండలేనయా
విలువ లేని నా కొరకు విలువైన రుధిరం కార్చి
వివరించలేని ప్రేమతో నన్ను కోరుకున్నావయ్యా
వివరించగలనా వెలలేని నీ ప్రేమను
వర్ణింప నా తరమా! నీ త్యాగశీలతను
నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా
నేనేమిచ్చి ని రుణం తీర్చగలనయ్యా
1 చరణం :
నీతోనే నన్ను నడిపించు నా యేసయ్య
నీ కొరకు సాక్షిగా నన్ను బ్రతికించుమయ
నా శ్వాస ఉన్నంతవరకు నీ కొరకు జీవింతును
నా జీవిత కాలమంతా నిన్నే నే స్తుతింతును
విడువకు యేసయ్య క్షణంఉండలేనయ్య
నన్ను మరువకు యేసయ్య నడిపించుము యేసయ్య
నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా
నేనేమిచ్చి నీ రుణం తీర్చగలనయ్య
2 చరణం :
ఓటమి అంచులో ఒంటరినై నేనుండగా
ఓదార్చి వారే లేక నేలకొరిగిన వేళ
లేవనెత్తిన స్నేహితుడా నీ కొరకే ప్రకాశించును 2""
నీవు ఉన్నంతవరకు నీతోనే
నా కడ శ్వాస ఉన్నంతవరకు
విడువకు యేసయ్య క్షణం ఉండలేనయ్య
నన్ను మరువకు యేసయ్య నడిపించుము యేసయ్య
నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా
నేనేమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా
Follow, Like and Share
Telegram Channel: Click Here
Facebook Page: Click Here
For More Songs Click Here


No comments:
Write CommentsSuggest your Song in the Comment.