NENENTHA DHANYUDANO || నేనెంత ధన్యుడనో...ప్రియుడా యేసయ్యా || LATEST TELUGU CHRISTIAN SONG 2024 || PASTOR AKSHAY||SANDEEP||YEDIDYA PICTURES
నేనెంత ధన్యుడనో...ప్రియుడా యేసయ్యా
నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి
సమృద్ధి కృపతో..మారని ప్రేమతో..
ఉన్నత కార్యములు నాకై చేసితివి
పరవశమే పరిమళమే నీ కౌగిలి లో
సంతసమే సంబరమే నీ సన్నిధిలో
నేనెంత ధన్యుడనో...ప్రియుడా యేసయ్యా
శ్రమకు తాళలేని స్థితిలో నే తల్లడిల్లు వేళ
నీ కరము చాపి నన్ను చేరదీసి
నీ చెలిమి పంచినావే నా హితుడవై
గమనం నా గమ్యం నీ కృప లోనే
గానం నా గాత్రం నీ కొరకే
నేనెంత ధన్యుడనో...ప్రియుడా యేసయ్యా
నిరాశ చెందు స్థితిలో నే సాగలేని వేళ
నీ ఆత్మ వర్షమును పంపి నాకై
ఫలియింపచేసినావే నాదు బ్రదుకును
స్వాస్థ్యం నా సర్వం నీవేనయ్య
జీవించెద నీకై శ్రేష్ఠ ఫలముగా
నేనెంత ధన్యుడనో...ప్రియుడా యేసయ్యా


No comments:
Write CommentsSuggest your Song in the Comment.