Kanneere Keerthanalaaye || కన్నీళ్లే కీర్తనలాయే || Dr.Asher Andrew || Telugu Christian Song
పల్లవి :-
కన్నీళ్లే కీర్తనలాయే గాయాలే గానాలాయే...
కాచినావు కాపాడేదవు, మోసినావు మోయుదువు
మారని దేవా మహోన్నత ఇదియే మా కృతజ్ఞత "2"
ఎలా తీర్చగలను నీ ఋణమును"2"
"కన్నీళ్లే "
చరణం-1
అర్హతే లేని నాపై అంతులేని కృపను చూపి..
ప్రేమతో పిలచితివి తండ్రీవై మోసితివి "2"
నే తూలిన ప్రతి క్షణాన భుజములపై మోసితివి "2"
నమ్మకమే లేని నన్ను నమ్మిన ప్రేమవు నీవు "2"
" కన్నీళ్లే "
చరణం -2
నే చూడని యుద్దాలు నీవే పోరాడితివి
తెలియని ఆపద నుండి నీవే కాపాడితివి "2"
నేనడుగని దీవెనలు మెండుగా నొసగితివి "2"
నాదు బలహీనతకంటే కృపయే బలమైనది "2"
" కన్నీళ్లే "
చరణం -3
వాగ్దానములనిచ్చి జీవాలయము కట్టి
నీ స్పర్శ తాకిన వారే సాక్షులుగా నిలిచినారే "2"
నీదు సమృద్ధి చేత పోషించుచున్నావే "2"
మా ప్రేమ మారినా నీ ప్రేమ మారదు "2"
" కన్నీళ్లే "
చరణం -4
మహిమయే లేని చోట మహిమను రప్పించావే
ఇంతవరకు సహాయకుడవై ఎబినేజరువైనావే "2"
గొర్రె పిల్ల రక్తముతో మా కథనే వ్రాసావే "2"
నీ పిలుపు మారదు ఎన్నడూ ఓడిపోదు "2"
"కన్నీళ్లే "
Follow, Like and Share
Telegram Channel: Click Here
Facebook Page: Click Here
For More Songs Click Here


No comments:
Write CommentsSuggest your Song in the Comment.