Nannu Gnaapakamu Chesukonumaa || నన్ను జ్ఞాపకము చేసుకొనుమా... || Dr.Asher Andrew
ప్రార్థనలో నేను పోరాడేదా - అలయక నీ పాద సన్నిధిన.......
విశ్రమింపను నేనెన్నడు నిన్ను - విశ్రమింపనియ్యను ఎన్నడూ............
ప్రభువా...... నన్ను జ్ఞాపకం చేసుకోనుమా........//2//
ఈ ఒక్క సారి దయ చూపుమయ్యా............//2//
1. పాపపు కేకలు పైపైకేగసినా - ప్రార్థన ధూపము పైపైకెగరని
తీర్పు ముందు కృపాయే గెలవని - నీ దయ మమ్ము చేరనిమ్ము
అబ్రహాము మొరను జ్ఞాపకముంచి - లోతును కాపాడినావు......
నా ఇంటి వారిని కరుణించుమా - నా కుటుంబమును రక్షించుమా.......
// ప్రభువా నన్ను //
2. వైరి మాటలే తూటాలుగ మారి - మానని గాయాన్ని మరి మరి రేపగా
నీ సన్నిధిలో బహుగా ఏడ్చి - నీ కృప నిమ్మన్ని మరి మరి కోరగా
హన్నా మొరను జ్ఞాపకముంచి - గర్భమును తెరచినావు
మూసిన ద్వారాలు తెరపించుమా - అవమానమంతా తొలగించుమా
// ప్రభువా నన్ను //
Follow, Like and Share
Telegram Channel: Click Here
Facebook Page: Click Here
For More Songs Click Here


No comments:
Write CommentsSuggest your Song in the Comment.