Nayakudu || Maharaajuve Song Lyrics || నాయకుడు - 2026 నూతన సంవత్సర గీతం
పల్లవి :-
మహా రాజువే మా నాయకుడవే నడిపించు నా దైవమే
ప్రతీ స్థలమునా జతే చేరినా ప్రియమైన నా హితుడవే 2
ప్రతి స్థితిలోన నడిపిన వైనం ఆశ్చర్యమే కలిగించే ప్రతీ క్షణం 2
ఆరాధింతును అను నిత్యము నిను కొనియాడెదను నిరతము 2
శత్రు భయముతో మది అలజడితో మార్గమే కానక నిలచిన వారికి 2
చెదరిన గుండెకు బలమివ్వగా నిలిపితివి సంద్రము జలరాశిగా
విస్మయ మొందెను వెనుతిరుగగా మరణించే శత్రువు కనిపించక
స్తుతియుంచుచూ సాగేనాపయనము చేర్చితివి క్షేమముగా ఆ గమ్యము 2
ఆరాధింతును అను నిత్యము నిను కొనియాడెదను నిరతము 2
మంటిని కూర్చి పాత్రగ మలచి నీ పోలికనిచ్చి మహిమగ తీర్చి 2
నిలిపితివి నన్ను నీవానిగా ఆత్మల రక్షణకై ఒక ప్రమిదగా
సాగెదను నేను నీ సాక్షిగా నీ స్వరము నాలో ధ్వనియించగ
ఇదే నాకు నిజమైన నిరీక్షణ నీ కౌగిలిలో నాకు సంరక్షణ 2
ఆరాధింతును అను నిత్యము నిను కొనియాడెదను నిరతము 2
మరణము గెలచిన మృత్యుంజయుడవు మహిమతో దిగివచ్చు నా మహరాజువు 2
నీ మహిమ రాజ్యములో నిలవాలని జయించినవారితో గడపాలని
ఈ వాంఛ తీరగ తెరువేదని అక్షయుడా చేరితి నీ శరణని
వర్ణింపలేనయ్య నా భాగ్యము కడవరకు కృపలోనే నా పయనము.
మహా రాజువే మా నాయకుడవే నడిపించు నా దైవమే
Follow, Like and Share
Telegram Channel: Click Here
Facebook Page: Click Here
For More Songs Click Here


No comments:
Write CommentsSuggest your Song in the Comment.