NIJAMAINA DRAKSHAVALLI
నిజమైన ద్రక్షవల్లి నీవే - నిత్యమైన సంతోషము నీలోనే "2"
శాశ్వతమైనది ఎంతో మధురమైనది
నాపైన నీకున్న ప్రేమ - ఎనలేని నీ ప్రేమ
ఎనలేని నీ ప్రేమ
నిజమైన ద్రక్షవల్లి నీవే - నిత్యమైన సంతోషము నీలోనే
1. అతికాంక్షనీయుడా దివ్యమైన నీ రూపులో
జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా "2"
శిధిలమై ఉండగా నన్ను - నీదు రక్తముతో కడిగి
నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా "2"
నిజమైన ద్రక్షవల్లి నీవే - నిత్యమైన సంతోషము నీలోనే
2. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో
అర్పించుచున్నాను సర్వము నీకే ఆర్పనగా "2"
వాదిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు
జీవపు ఊటవై బలపరిచితివే నాయేసయ్యా "2"
౩.శాలేము రమ్యమైన సీయోనుకే
నను నడిపించుము నీచిత్తమైన మార్గములో "2"
అలసిపోనివక నన్ను నీదు ఆత్మతో నింపి
ఆదరణ కర్తవై నను చేర్చుము నీ రాజ్యములో "2"
నిజమైన ద్రక్షవల్లి నీవే - నిత్యమైన సంతోషము నీలోనే "2"
శాశ్వతమైనది ఎంతో మధురమైనది
నాపైన నీకున్న ప్రేమ - ఎనలేని నీ ప్రేమ
ఎనలేని నీ ప్రేమ
నిజమైన ద్రక్షవల్లి నీవే - నిత్యమైన సంతోషము నీలోనే
Follow, Like and Share
Glory to God.!!
ReplyDelete