HOSANNA MINISTRIES NEW
YEAR SONG
LYRICS
|| GHANAMAINAVI NEE
KAARYAMULU LYRICS
ఘనమైనవి నీ కార్యములు నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
స్తుతులర్పించెదను అన్నివేళలా
అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే
1. యే తెగులు సమీపించనీయక యే కీడైన దరిచేరనీయక
ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు
నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము
2. నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడెము నీవే
ఆశ్రయమైన బండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే
నా ప్రతిక్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము
3. నీ కృప తప్ప వేరొకటి లేదయా నీ మనసులో నేనుంటే చాలయా
బహు కాలముగా నేనున్నా స్థితిలో నీకృప నా యెడ చాలునంటివే
నీ అరచేతిలో నను చెక్కుకుంటివే నాకేమీ కొదువ
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము
ఘనమైనవి.. స్థిరమైనవి..
ఘనమైనవి నీ కార్యములు నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా
No comments:
Write CommentsSuggest your Song in the Comment.