బలిపీఠమే
బలిపీఠమే బలిపీఠమే
కళంకము కడిగిన
కన్నీరు తుడిచిన
కల్వరి బలి పీఠమే
1. పాప నివృత్తి చేయ పరిహార బలి అయిన
పరలోక బలిపీఠమే
రక్తము చిందించి రక్షణ నొసగిన
రక్షకుని బలిపీఠమే
2. మన్నించు మన్నించుమని
మనసారా పలికినట్టి
మహిమా బలిపీఠమే
ఎప్పుడు చేరిననూ
కనికరించి సహాయం చేసే
కరుణ బలిపీఠమే
3. ప్రక్కను ఈటెతో నా కొరకై
పొడవబడిన ప్రియుని బలిపీఠమే
రక్తము, నీరును ప్రవహించె జీవనదియై
కృతజ్ఞత ఎలా చూపెదన్
4. సమాప్తమైనదనుచూ
అన్నియూ చేసి ముగించిన
అద్భుత బలిపీఠమే
అప్పగించుచున్నాను ఆత్మను అని
అర్పించిన సాటిలేని బలిపీఠమే
No comments:
Write CommentsSuggest your Song in the Comment.