Christmas Mashup 2024
1. భూమికి పునాదులు వేసినవాడు ఎలోహిం
జేనతో ఆకాశములను కొలిచినవాడు ఎలోహిం
ప్రపంచములను చేసినవాడు ఎల్ షద్దాయి
నక్షత్రములకు నామకరణము చేసినవాడు...
ఎల్ షద్దాయి
వాక్యమై....శరీరధారియై ,……కృపాసత్యసంపూర్ణుడై....
రిక్తుడై.......అభిషిక్తుడై,………సర్వలోక రక్షకుడై........
మనలో, మనతో ఒకటిగా ఇలా జీవింప
దిగివచ్చే రారాజు యేసు..
తనతో మనలను కొనిపోవ మరల రానున్న
మహారాజు క్రీస్తు...
2. పరిశుద్ధాత్మతో పుట్టిన పరిశుద్ధుడు
పరిశుద్ధుడు...అతిపరిశుద్దుడు
పదివేలలో అతిసుందరుడు
కన్యకగర్భమున జనియించె కారణజన్ముడు
పరమాత్ముడే పసిబాలుడై
పరమతండ్రి ప్రతిరూపమై
కారుచీకటిలో కాంతిరేఖగా వెలిసెనే
మహిమ రాజ్యమునకు - అర్హత కలిగించెనే
మా ఇలవేల్పు నీవే దేవా - మా ఆధారం నీవే ప్రభువా
మా ఇలవేల్పు నీవే దేవా - మా ఆధారం నీవే ప్రభువా ||2||
నిను పోలినవారెవరు లేరయ్యా - ఈ సృష్టిలో
నీకు సాటిలేరయ్యాయా - ఈ జగతిలో || 2 ||
తలవంచెను - ఆకాశమే
తలదించెను - భూలోకమే
ప్రణమిల్లెను - పరలోకమే
సర్వలోకానికి రక్షణానందమే
3. నింగిలోని తారలన్నీ ఏకమై నిత్యదేవుని ఆరాధించిరి
ఆకాశాన దూతగనము తేరిచూచి
స్తోత్రగానమే ఆలపించిరి || 2 ||
రారాజుపుట్టెనని - రక్షకుడు పుట్టెనని
తోడుండుదేవుడని - కాపాడే నాధుడని || 2 ||
షాలోమ్- సర్వలోకానికి
షాలోమ్ - సర్వమానవాళికి
షాలోమ్ - స్వరములెత్తిపాడేదం
షాలోమ్......
చరణం : దారిచూపే నక్షత్రమే
నన్ను చేసినోడు పుట్టాడని
సృష్టి అంత సంబరాలు చేసెనే సృష్టికర్త పుట్టాడని
జ్ఞానమునకాధారమైనవానిని - జ్ఞాణులే ఆరాధించిరి
ప్రధానకాపరి పుట్టినవానిని - గొల్లలంత గుర్తించిరి
షాలోమ్- సర్వలోకానికి
షాలోమ్ - సర్వమానవాళికి
షాలోమ్ - స్వరములెత్తిపాడేదం
షాలోమ్......
క్రిస్మస్ - సర్వలోకానికి
క్రిస్మస్ - సర్వమానవాళికి
క్రిస్మస్ - స్వరములెత్తిపాడేదం
క్రిస్మస్ --- క్రిస్మస్
4. వచ్చాడురోయ్ - దివినుండి భువికి
రారాజుగా యేసు మహారాజుగా
పుట్టాడురోయ్ - సర్వలోకానికి
గొప్ప రక్షణగా యేసు అద్భుతముగ (2)
రాజ్యము విడిచే ఓహో ఓహో ఓహో -
రాజసం మరిచే— ఓహో ఓహో ఓహో
తండ్రిని విడిచే ఓహో ఓహో ఓహో -
త్యాగమున్ ధరించే ఓహో ఓహో ఓహో ఓహో ఓ….
జగాలలో ….తరాలలో…. యుగాలలో…. ఉన్నవాడు
అందరిలో....అన్నింటిలో....అంతటా వ్యాపించినాడు (2)
ఆయనే…. ఉన్నవాడు ..అనువాడు
ఆయనే....మనకు తోడు యెల్లవేళలా వుండువాడు
జై జై జై జై జై జై జై జై జై బోలో జై
జై జై జై జై జై జై జై జై జై బోలో జై (2 )
జై బోలో యేషు మసీకి
జై జై జై జై జై జై జై జై జై బోలో జై
జై జై జై జై జై జై జై జై జై బోలో జై (2 )
BARUCH ADONAI
ELOHIM TZ’ VA’OT
ASHER HAYAH
V’ HOVEH V’YAVO
BARUCH ADONAI
ELOHIM TZ’ VA’OT
ASHER HAYAH
V’ HOVEH V’YAVO
యూదాగోత్రపు సింహము - ఉదయించే మనకోసమే
దావీదు వేరు చిగురు - ధరియించె దాసుని రూపం
తనువై-కానుకై - దీనుడై - రక్షణై - నిరీక్షణై - ఇలా వచ్చెను
ఆ మ్రానుపై - యాగమై - గాయమై - రక్తమై -
మరణమై మరి లేచెను.....
విజయమై - ధైర్యమై - నిత్యమై - సకలమై -
ఆదియు - అంతమై
జీవమై - సర్వమై - నీలిచెనే మా పక్షమై
సర్వాధికారియై - సర్వోన్నతుడై...సమీపస్థుడై...
సదాకాలము
No comments:
Write CommentsSuggest your Song in the Comment.