బురదలో మొలిచిన
బురదలో మొలిచిన కలువకు మలినమంటదు ఎప్పటికి
ఉప్పు నీటిలో చేపకు ఉప్పదనం రాదు ఎన్నటికీ(2)
పాపపు లోకంలో బ్రతికే ఈ మనిషికి
పాపమంటు కొనుట ఇది విడ్డురం || బురదలో ||
1. ఆశించకు సోదరా పాపపు లోకమిది ౼
లోకముతో స్నేహము వైరమే కదా(2)
ప్రేమగల యేసుడు తన ప్రాణము నియ్యగా(2)
నీ హృదయం దేవునికి ఇవ్వలేవ(2)
లోపాలను దిద్దుకునే వాక్యమే అద్దము
ఈ చీకటి లోకంలో దీపమే వాక్యము(2)
2. పాపపు పురములు సొదొమ గొమొఱ్ఱలు ౼
నీతిగా లోతు అందు బ్రతుకలేద(2)
చేయని నేరానికి పొరుగు దేశమందు (2)
యేసేపు శిక్షననుభవించలేద(2)
వారికి అంటని పాపం నీకెందుకు అంటుతుంది
వారికి వలె బ్రతికితే పరలోకం వస్తుంది(2)
No comments:
Write CommentsSuggest your Song in the Comment.