మన్నించే ప్రేమ - కనిపించే నీలో -
ఆదరించావుగా - నా దేవ నా యేసయా
లాలించే నీ ప్రేమ - ఉప్పొంగే నాలోన
- ఏనాటి అనుబంధమో
గుండెల్లో నీవేగా - సంతోష గానంగా
- సాగాలి కలకాలము
ఏపాటి నన్ను - ప్రేమించినావు -
తీర్చేదెలా నీ ఋణం - నీకేగా ఈ జీవితం
1. నీతో మాట - నీతో బాట - వరమే ఈ పయనం
ఆశే నీవై - ధ్యాసే నీవై - కొలిచే ఈ సమయం
ఉన్నావు తోడు నీడై నాతో - నా యేసయ్యా
దాచావు ఎన్నో మేళ్లు నాకై - నా యేసయ్యా
నీవు లేనిదే - మనలేనుగా - నీవేగా నా ధైర్యము
ఆటంకాలెన్నున్నా అవమానాలెదురైనా
రక్షించే దైవంగా - విశ్వాసం నీవేగా
నీవే కదా యేసయ్య - ఆధారం నీవేనయ్యా
నాలోన చిరు కోరిక - నీతోనే బ్రతకాలిక
2. నీవే ప్రాణం - నీవే ధ్యానం - పలికే నా హృదయం
భారం మోసి - బలమే నింపి - మలిచే నా గమనం
చుక్కాని నీవై దారే చూపే - నా యేసయ్య
అందాల లోకం నీలో చూసా - నా యేసయ్య
ప్రతి చోటున నీ సాక్షిగా జీవించే నా భాగ్యము
నా జీవితపయనంలో - బలహీన సమయంలో
ఓదార్చే దైవంగా - నిలిచింది నీవేగా
నీవే కదా యేసయ్య - ఆధారం నీవేనయ్యా
నాలోన చిరు కోరిక - నీతోనే బ్రతకాలిక
No comments:
Write CommentsSuggest your Song in the Comment.