Nee Aatmatho | Telugu Worship Song | Vijay Kondapuram ft. Allen Ganta, Enosh Kumar & Jerusha Joseph
నీ ఆత్మతో నన్ను నడిపించయా
నీ మార్గము నాకు చూపించయా
నీ సత్యము నాలో కలిగించయా
నీ చిత్తము నా యందు నెరవేర్చయా
నీ ప్రేమను చూపించాయా
నీ స్వరమును వినిపించయా
నీ సన్నిధిలోకి నను చేర్చయా
శుధాత్మను కుమ్మరించాయా
కరుణించు దేవా కృప చూపుమయ్యా
నా తోడూ నీవై నడిపించు యేసయ్యా
||2||
1. నీ సన్నిధి త్రోసివేసి పారిపోతిని
లోకాశలుకు లొంగి పడిపోతిని
క్షయమైన ఆనందము నాసించితిని
నిను వదిలి నను నేను కోల్పోతిని
నా దోషములను కనుగొంటిని
నీ దయ కొరకు తపించితిని
నీ ప్రేమ విలువ తెలుసుకొంటిని
తిరిగి నీవైపు నే తరలితిని...
|| కరుణించు||
2. నా తండ్రి దేవా నా కాపరి...
నీ ప్రేమతో నన్ను మార్చితివి...
నా స్థితిని గమనించి కనికరమును చూపించి నా వైపు పరుగెత్తి కౌగిలిలో నను చేర్చి....
||4||
నీ ప్రేమను చూపించితివి...
నీ వాతల్యము దయచేసితివి...
నీ రక్తముతో నను కడిగితివి...
నిత్య రాజ్యములో చేర్చుకొంటివి...
ఇక నీ కొరకే నేను జీవింతునయ్యా...
నీ ప్రేమనే ప్రకటింతునేసయ్యా...
||2||

