రచయిత : M.Prasanth Raju Gaaru
పల్లవి: ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను
1. ధవళవర్ణుడు - రత్నవర్ణుండు నా ప్రియుడు
అవని పదివేలందు అతి శ్రేష్ఠుడా తండు ||2||
ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు.... ||2||
ఆ.........ఆ..........ఆ.............ఆ.....................
అవలీలగానతని గుర్తింపగలనమ్మా ||2||
ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను
2. కురులునొక్కులు కలిగి - స్పురద్రూపియగు విభుడు మరులు
మనసున నింపు మహనీయుడాతండు సిరులుకురిపించెను
శ్రీదేవ తనయుండు విరబూయు పరలోక షారోను విరజాజి
ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను
3. పాలతో కడిగిన నయనాలుగలవాడు
విలువగురతనాలవలె
పొదిగిన కనులు ||2||
కలుషము కడిగిన - కమలాల కనుదోయి
విలువైన చూపొసగె వరమేరితనయుండు ||2||
ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను
4. అతడతి కాంక్షణీయుండు-
రాయుండు
అతడే నాప్రియుడు అతడే నా హితుడు || 2 ||
ఆతని నోరతి మధురంబు మధురంబు
ఆతని పలువరస పగడాల సరివరుస
ఆతని పలువరస ముత్యాల సరివరుస
ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను
No comments:
Write CommentsSuggest your Song in the Comment.