పాడనా..మౌనముగానే - స్తుతి కీర్తన
చూడనా ఊరకనే నిలిచి - నీ పరాక్రమ కార్యములు
యేసయ్యా నీతో సహజీవనము - నా ఆశలు తీర్చి తృప్తి పరచెనే
పాడనా..మౌనముగానే - స్తుతి కీర్తన
1. ప్రతి ఉదయమున - నీ కృపలో నేను ఉల్లసింతునే
నీ రక్తాభిషేకము కడిగెనే - నా ప్రాణాత్మశరీరమును
నా విమోచనా గానము నీవే - నా రక్షణ శృంగము నీవే
పాడనా..మౌనముగానే - స్తుతి కీర్తన
2. దీర్ఘ శాంతమూ - నీ కాడిని మోయుచూ నేర్చుకొందునే
నీ ప్రశాంత పవనాలు అణచెనే - నా వ్యామోహపు పొంగులన్నియూ
నా ఓదార్పు నిధివీ నీవే - నా ఆనంద క్షేత్రము నీవే
పాడనా..మౌనముగానే - స్తుతి కీర్తన
3. నీ ఆలయమై - నీ మహిమను నేను కప్పుకొంటినే
నీ తైలాభిషేకము నిండెనే - నా అంతరంగమంతయునూ
నా మానస వీణవు నీవే - నా ఆరాధన పల్లకి నీవే
పాడనా..మౌనముగానే - స్తుతి కీర్తన
No comments:
Write CommentsSuggest your Song in the Comment.