నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా (2)
నేనేమైయున్నా ఏ స్థితిలో ఉన్నా (2)
ఇంకేమి కోరుకోనయ్యా (2) ||నమ్మకమైన||
1. ఆప్తులైన వారే హాని చేయచూసినా
మిత్రులే నిలువకుండినా (2)
న్యాయము తీర్చే నీవు నాకుంటే (2)
చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన||
2. జ్ఞానమంత చూపి శక్తి ధారపోసినా
నష్టమే మిగులుచుండినా (2)
శాపము బాపే నీవు నాకుంటే (2)
చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన||
3. కష్ట కాలమందు గుండె జారిపోయినా
గమ్యమే తెలియకుండినా (2)
సాయము చేసే నీవు నాకుంటే (2)
చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.