వద్దు వద్దు వద్దు వద్దు వద్దు వద్దు వద్దు ఓరన్నా
ఈ పులుముకున్న భక్తివద్దురా ఓరన్నా
గడ్డి పూవులాంటి భక్తివద్దురా ఓరన్నా
1. తెల్లబట్టలేసుకున్నావు పెద్దబైబిల్ పట్టుకున్నావ్
ప్రార్థన గుంపులకొచ్చి పొడుగు ప్రార్థన చేసినావు
గల్లీగల్లీకి నీ సాక్ష్యం గంభిరంగా చెప్పినావు
ఇంటికాడ నీ సాక్ష్యం ఇంతమంచిగున్నద ||వద్దు వద్దు||
2. ఆఫీసులేట్లున్నావ్ అంగట్లో ఎట్లున్నావ్
నాటుకడెట్లున్నావ్ కోతకాడెట్లున్నావ్
బస్టాపులెట్లున్నావ్ బస్తీలో ఎట్లున్నావ్ ||వద్దు వద్దు||
3. మందిరంలో ఉన్నప్పుడు మాదిరిగౌపిస్తావ్
మందిరంలో కెళ్ళివచ్చినాక మందు గొట్టితిరుగుతావు
వద్దువద్దు వద్దు ఒరన్న ఈ గుళ్లోతీరు బైతో తీరు ఒద్దు ఓరన్నా
ఈ పులుముకున్న భక్తసలే ఒద్దు ఓరన్నా....ఓచెల్లే ||వద్దు వద్దు||
4. కష్టాలొచ్చినప్పుడు ఎస్సయ్యని ఏడుస్తావు
తలపోటోచినప్పుడు తండ్రియని ఏడుస్తావు
కష్టాలన్నీ తీరినంక ఏటిగట్టెక్కుతావు యేసేవ్వడంటావు ||వద్దు వద్దు||
5. ప్రభుకొరకు నేను ప్రాణమైన పెడ్తాఅంటివి
బైబిల్ లెత్తి చెప్పినావు బాసాలెన్నో జేసినావు
పదిసినుకులు వర్షమొస్తే ప్రభు గుడికే రాకపోతివి
వద్దు వద్దు వద్దు వద్దు ఈ సగం సగం బ్రతుకొద్దురా ఓరన్నా
పూర్తి సమర్పణతో బతకావా ఓరన్నా ||వద్దు వద్దు||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.