పల్లవి: ఓ అన్నలారా! దేవుడు మనకు ఇచ్చిన
దివ్యమైన మాటలు ఈ బైబిలు, మనసును శుద్ధిచేసే
గొప్పశుభమైన సమాచారం ఈ బైబిలే.
1. భయముతో, భక్తితో దీనిని చదివిన యేసు
మనకు ఆశ్రయం అని తెలుపుతుంది.
దయగలిగిన దేవుడే
మన తండ్రి అని బోధించును.
2. బైబిల్ను చదివితే సత్యము,
శాంతము మనకు లభిస్తాయి.
మంచి పనులకు ఫలితము లభిస్తుంది.
నిస్సందేహంగా నిత్యజీవము లభిస్తుంది.
3. ఆశీర్వాదము ఇచ్చే ఆ బైబిల్ను
మీరు అనుసరించండి.
మీ పాపములను వదలి పరలోకం వెళ్లే దారి
తెలుసుకోవాలని అనుకొనేవారు దానిని అనుసరించండి.
4. పాపపు పనుల నుండి విడుదల పొందితే సుఖంగా
ఉండవచ్చును అని. తలంచితే మీ కోరిక బైబిల్
తీరుస్తుంది. వెంటనే రండి.
యేసును అంగీకరించండి.
5. పాప రుణములను తీర్చుటకు మధ్యవర్తి కావాలంటే
త్వరగా యేసు వద్దకు రండి. దయామయుడగు
యేసు చెంతకు రండి.
6. మరణమునకు భయపడేవారు పరమ శాంతిని
ఇచ్చే యేసు దగ్గరకు వేగంగా రండి.
7. పాపపు ఆలోచనలు లేని మనసు కావాలని నిజంగా
ఆశించేవారు మంచి హృదయంగల యేసు నొద్దకు
వేగంగా రండి.
8. పరలోక రాజ్యము చేరాలని కోరిక ఉన్న వారు
రక్షకుడైన యేసు నొద్దకు విశ్వాసముతో రండి.

