మనస్సు ఆనందమ
Singer: Dr. Banti
Lyrics : Purushottam choudhary
Music : V.K.Henry 
పల్లవి: మనస్సు ఆనందము పొందుట కంటే
మరి ఏ భాగ్యము కలదు? 
ఇక అఖిల సుఖములు రోజుకు ఒక 
  రీతిగా గడియకు ఒక తీరుగా ఉంటాయి.
1. ధైర్యముగా ప్రార్ధన అను ఖడ్గము పట్టి, 
తిరుగు పిసాచము  భయపడునట్లు 
మంచి కాంతిగల ప్రభువు 
     చెప్పిన శాస్త్రపు మాటలు,  సూక్తులు, 
పెక్కు సంశయము అను బురదను తీసివేయును. 
అనుమానము  పటాపంచలగును.
2. మంచివారు క్రైస్తవ సాంగత్యము 
చేస్తే ఎంతో మేలు కదన్నా! 
శోధనలన్నిటినీ ధైర్యముగా ఎదుర్కొను 
    మంచి మనసు కంటెను ఇంక సుఖము ఏమున్నది ?
 3. మనస్సున నేను అను అహంకారము కలవానికి 
తగిలే చెడ్డతనము తెలిసి రావలెనన్నా! రక్షకుని 
     సిలువను చూచి మిక్కిలి విశ్వాసము కలిగి ఉండాలి. 
4. ప్రభువు నొద్ద క్షమయు, స్నేహము నేర్చుకుంటే 
మనకు శత్రువులు ఇక భూమియందు ఉండరన్నా!  
    సమదృష్టితో భూజనులులను తెలుసుకొనుట  
మంచిక్రైస్తవులు అనుసరించ దగినది. 
5. పరమ దయానిధి అయిన క్రీస్తుని బలము చేత 
పాపపు మూటలు తొలగిపోవును. పరిశుద్ధాత్ముని 
     సంబంధముతో ఎటువంటి తేడాలు లేక చిన్న 
పాటి చీకటి తెరలన్నియు తొలగిపోవును.


No comments:
Write CommentsSuggest your Song in the Comment.