ఓ మంచి సమరయుడా
ఓ మంచి సమరయుడా - నా మంచి స్నేహితుడా (2)
నీ వంటి వారు నాకిలలో లేరు నా ప్రాణనాదుడా  (2)
నా ప్రాణనాదుడా
                                || ఓ మంచి సమరీయుడా||
1. నాకున్న నా వారుఅందరరు విడువగా 
నా ముందు నిలిచి రమ్మని పిలిచి (2)
పరుగెత్తుకొని వచ్చి నిన్ను చేరగా 
కన్నీరు తుడిచిన కరుణామయ  (2)
 || ఓ మంచి సమరీయుడా||
2. మోడైన నా బ్రతుకు చిగురింపచేయ 
జీవనదియై నన్ను చేరినావా (2)
శ్రేష్ట ఫలములు నీకిచ్చుటకై
ఫలింపచేసిన పరిశుద్ధుడా (2)
 || ఓ మంచి సమరీయుడా||
                                     
3. అల్పుడనగు నన్ను హెచ్చించుటకై 
సర్వాధికారి రిక్తునిగా మారి (2)
పరలోక ద్వారం నాకై తెరువగా
 నర రూపమెత్తిన నజరేయుడా (2)
 || ఓ మంచి సమరీయుడా||
                                    


No comments:
Write CommentsSuggest your Song in the Comment.