అనుదినం నీ ప్రేమ
అనుదినం నీ ప్రేమ... అనుక్షణం నీ దయ
నీ కృపాక్షేమమే...నా వెంట రాగా..
1. నా మంచి కాపరై నా ముందు నడువగా...
నాకున్న దేవుడై నాచేయి విడువక...
నా తండ్రివై నీవు నడిపించుచుండగా...
నీ ప్రేమలో నిలిచి నే పరవసింతును. ||అనుదినం||
2. నా దినములన్నియు..నీవశములేకదా....
నా అడుగులన్నియూ...నీవే స్థిరముచేయగా...
కోరుకొందును నిన్నే నా మొదటి ప్రేమగా...
సాగిపోదును నేను...నీ సాక్షినై ఇలలో...||అనుదినం||
3. నీ రాకకై నేనూ..వేచి యుందునూ ప్రభూ...
నీ పిలుపుకై నేనూ..ఎదురు చూతునూ..
గురి యొద్దకే నేనూ పరిగెత్తుచుందునూ..
నా ప్రభువు ముందుగా మోకరిల్లుక్షణముకై...
అనుదినం నీ ప్రేమ... అనుక్షణం నీ దయ...
నీ కృపాక్షేమమే...నా వెంట రాగా..||అనుదినం||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.