జగమంతా దివ్య కాంతితో
జగమంతా దివ్య కాంతితో - ప్రకాశించే క్రీస్తు జన్మతో “2”
దేవుడే మానవుడై మన మధ్య నివశింప -
ప్రేమానురాగాలు పంచగ ఇలలో
పాపులను రక్షింప ప్రాణమునే అర్పింప -
పావనుడే ఈ భువికి వచ్చు వేళలో “2”
1. చీకటి నిండిన పాపము పండిన -
లోకమునెంతో ప్రేమించెను
త్రోవ తప్పిన దేవుని విడిచిన -
పాపిని ఎంతో క్షమించెను “2”
లోక పాపములు మోయు గొర్రెపిల్లగా క్రీస్తు -
శిలువలో మరణించి పాపమునే తొలగించే
లోకమును వెలిగింప క్రోవుత్తుల కరిగే -
బ్రతుకు చీకటిని పారద్రోలేను
వేవేల కాంతులతో నిండెను బ్రతుకంతా
శ్రీ యేసు జన్మించగా - ఈ లోకానికే పండుగా
2. ఆజ్ఞతిక్రమమే పాపమాయెను -
నిత్య మరణానికి దారితీసేను
దేవుని కృపలో క్రీస్తునందు-
నిత్య జీవం అనుగ్రగించెను “2”
నశించినవారిని వెదకి రక్షించుటకు -
అరుణోదయ తారయై ఉదయించెను
విశ్వసించు ప్రతివాడు నిత్యజీవమును పొంద -
జీవహారమై దిగివచ్చెను
మరణపు ముళ్ళు విరిచేను పరలోకం చేర్చెను
శ్రీ యేసు దారికి చేరగా - విశ్వాసముంచి నీవు కొలువగా
No comments:
Write CommentsSuggest your Song in the Comment.