NA PAKSHAMUNA I నా పక్షమున నీవుండగా I A R Stevenson I Latest Telugu Christian Song Lyrics
నా పక్షమున నీవుండగా ముందెవరూ నిలువలేరుగా
ఊరక నిలిచిన కార్యం జరుగును
అ.ప.: యుద్ధము నీదే మా యెహోవా
1. మోసగించబడ్డాను త్రోసివేయబడ్డాను
ఆందోళనతో విలపించాను
నా దుఃఖమును నాట్యంగా నీవే మార్చావు
వేదించిన శత్రువు ఆశ భంగం చేసావు
నెమ్మదినిచ్చావు యేసూ నెమ్మదినిచ్చావు
2. అణగద్రొక్కబడ్డాను విడిచిపెట్టబడ్డాను
అంతా ముగిసిందనుకున్నాను
నా ఓటమిని విజయంగా నీవే మార్చావు
కోల్పోయిన స్థానం కంటే హెచ్చుగా లేపావు
గాయం మాన్పావు యేసూ గాయం మాన్పావు
3. గేళి చేయబడ్డాను గాయపర్చబడ్డాను
అవమానముతో సగమయ్యాను
నా స్వప్నమును సత్యంగా నీవే మార్చావు
ఊహించని దిక్కుల నుండి సాయం పంపావు
భారం దించావు యేసూ భారం దించావు
Follow, Like and Share
Telegram Channel: Click Here
Facebook Page: Click Here
For More Songs Click Here

