RAATHIKUNDANU NENU I రాతికుండను నేను I A R Stevenson I Popular Telugu Christian Song Lyrics
రాతికుండను నేను ఖాళీయైయున్నాను
అ.ప. : నింపుమా అంచులవరకు
నీకింపుగా మార్చబడుటకు
1. వెర్రిద్రాక్షలు లోనికి చేరెను
అంతరంగము చేదుగ మారెను
మాధుర్యం పంచుటకు తగిన పాత్రగా
శుభ్రము చేయుమా నను శుభ్రము చేయుమా
2. జీవడంబము మిగిలియుండెను
లోక స్నేహము చెరుపుచుండెను
మాలిన్యం ఏమాత్రం అంటకుండగా
భద్రము చేయుమా నను భద్రము చేయుమా
3. తప్పు బోధకు కలత చెందక
చెడ్డమాటతో శ్రమను పొందక
నీకోసం నమ్మికతో ఎదురుచూడగా
సిద్ధము చేయుమా నను సిద్ధము చేయుమా
Follow, Like and Share
Telegram Channel: Click Here
Facebook Page: Click Here
For More Songs Click Here

